Back to FeedQuickToday Shorts

Andhra Pradesh
Jul 30, 2026Short Read
టీటీడీ నకిలీ వెబ్సైట్ల పట్ల జర భద్రం..!
క్విక్ టుడే న్యూస్, జులై 30 :- టీటీడీ పేరిట కొందరు దుండగులు నకిలీ వెబ్సైట్లను సృష్టించి భక్తులను మోసగిస్తున్నారనే అంశంపై విజిలెన్స్ అధికారులు తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు.
ప్రస్తుతం సోషల్ మీడియాలో ttddevasthanam.online అనే ఫేక్ వెబ్సైట్ విపరీతంగా ప్రచారంలో ఉందని, దానిపట్ల జాగ్రత్తగా ఉండాలని సూచించారు.శ్రీవారి దర్శనాలు, ఆర్జిత సేవలు, గదుల కేటాయింపు కోసం భక్తులు కేవలం టీటీడీ అధికారిక పోర్టల్ https://ttdevasthanams.ap.gov.in/ ద్వారా మాత్రమే టికెట్లు బుక్ చేసుకోవాలని, అనధికారిక లింకులను క్లిక్ చేసి మోసపోవద్దని అధికారులు స్పష్టం చేశారు.





